Toggle Sidebar
Events
(0)
No events found.
Followers
(0)
User does not have any followers yet
Following
(0)
User isn't following anyone yet
Friends
(3) View All
Mutual Friends
( 0 )
 • No mutual friends currently
Groups
(0)
 • No groups yet.
Recent updates
 • Post is under moderation
  భర్త తో గొడవపడిన భార్య , అలిగి‌పుట్టింటికి వెళ్లిపోయింది ... నెల , రెండు నెలలు , మూడు నెలలు ఇలా ఆరు నెలలు గడిచినా ఆమె తిరిగిరాలేదు‌ ...
  దాంతో భర్త ప్రతిసారీ ఫోన్ చేస్తునే ఉన్నాడు వాళ్ల అత్తగారికి ... ప్రతిసారీ సమాధానం ఒకటే , మా అమ్మాయ్ మీ పై చాలా కోపంగా ఉంది ., తనిక రాదు ...
  ఒకరోజు ...
  భర్త : అత్తయ్య గారు ..! మా ఆవిడ ..!?

  అత్తయ్య : ( కోపంగా ) తనింకా కోపంగానే ఉంది , నీ ఇంటికి రానంటోంది ...

  భర్త : అవునా ..!?

  అత్తయ్య : ( మరింత కోపంగా ) అవును , ఐనా ఎన్నిసార్లు చెప్పాలి మీకు మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నారు ...

  భర్త : అదేంటో అత్తయ్య గారు , నేను ఫోన్ చేసిన ప్రతిసారీ మీరు తను రాదు తను రాదు‌ అంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది , మందు కొట్టకుండానే మాంచి కిక్ ఎక్కేస్తుంది ... అందుకే ప్రతి సారి ఆ మాట వినడం కోసం ఫోన్ చేస్తున్నా ...!
  ?????????
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  *విమానం లో భోజనం*

  విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కి ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం, ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

  సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు. అన్నీ నిండి పోయాయి. కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను.
  "ఎక్కడకి వెడుతున్నారు?" అని.
  " ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు" అన్నాడు అతను .

  ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
  .
  " మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
  " వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
  " సరే ! "
  నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

  " ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...
  నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

  అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...
  నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
  వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
  నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
  ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
  ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...
  మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

  నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
  " మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
  నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
  అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
  అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
  విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

  నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
  ప్రయాణం ముగిసింది .

  నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు.

  నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
  .
  ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెళుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

  ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
  " బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

  ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !
  (Soumendra Bandopadhyay గారి పోస్టు అనువాదం)
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  నువ్వే నా జీవన గమనానికీ ఒక వరమయ్యావు
  నా గుండెలో లో పలికింది నీ ప్రేమ ప్రణయగీతమై
  మన ఇరువురి జీవితం ఒక మళయ మారుత గీతం
  అవ్వాలి ప్రతి రోజు ఒక మధుర గీతం...
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  ఒక బ్యాంకు మేనేజర్ హోటల్ కు వెళ్ళి..

  బాబు టిఫిన్స్ ఏమున్నాయి?

  ఇడ్లీ,వడ,దోస,పూరి,ఊతప్పం.

  సరే రెండు ప్లేట్ ఇడ్లీ,ఒక ప్లేట్ వడ, ఒక ఊతప్పం పార్సిల్ ఇవ్వు.

  లేవు అయిపోయినవి సార్.

  మరి ఇంత పెద్ద మెనూ చదివావు అన్నీ ఉన్నట్టు నా టైం వేస్ట్ చేసావు.

  సార్ నేను మీ ATM కు డబ్బుల కోసం వెళ్తే అది పిన్ అడుగుతుంది, కరంటా సేవింగా అనిఅడుగుతుంది,
  ఎంత కావాలని అడుగుతుంది, రసీదు కావాలా అని అడుగుతుంది,
  అన్నీ అడిగాక " నో క్యాష్ " అని వస్తుంది...
  అపుడు మాకెంత మండుతుంది సార్...
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  తెంచుకున్న బంధమే . . ,
  వీడిపోని జ్ఞాపకమై మిగిలింది . . .

  దూరమైన కలలే . . ,
  అంతులేని ఆశలుగా మిగిలాయి . . .

  మనసుతో చేస్తున్నా యుద్ధం . . ,
  మాటల్లో మాత్రం మౌనమైంది . . .

  నిట్టూర్పుతో వచ్చే కన్నీళ్లు . . ,
  ఎదురుచూడని ఓదార్పు అయ్యాయి . . .

  చేలించని ఈ హృదయం . . ,
  జీవించే దేహానికి తోడైంది . . . .

  గడిచిపోయిన కాలానికి . . ,
  వీడలేని కళ్ళెం వేసి . . ,
  భవిష్యత్తులోకి పరుగు ఎలా తియ్యాలి . . . ?
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  భర్తకి_దేవుడిచ్చిన_వరం:::::
  (చివరివరకు చదివితే తప్ప ఈ కథలోని
  దిమ్మతిరిగే ట్విస్ట్ మీకు అర్దంకాదు)
  .
  అరవింద్ తన భార్యతో ఇబ్బంది పడుతున్నాడని, ఎంతో ఏకాగ్రతతో తపస్సు చేసాడు.
  అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై దేవుడు వరం కోరుకొమ్మన్నాడు.
  .
  ''పరమేశా! మా ఆవిడ పరమ బద్ధకస్తురాలు.
  నేను పగలల్లా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాను. ఆవిడేమో టీవీలో సీరియళ్ళు చూస్తూ ఎంచక్కా కాలక్షేపం చేస్తుంటుంది. ప్రతి చిన్నదానికి నన్ను అర్దంచేసుకోకుండా గొడవపడుతుంటుంది,
  ఒక్కరోజు ఒకరి ఒంట్లోకి ఒకరు మేమిద్దరం పరకాయ ప్రవేశం చేసేలా అనుగ్రహించు స్వామి. నేను పడే కష్టం ఏమిటో ఆవిడకు తెలిసిరావాలి'' అన్నాడు ఆత్రంగా.
  .
  "ఓస్ ఇంతేనా..తదాస్తూ" అంటూ వరం ఇచ్చేసి పరమేశ్వరుడు మాయమైపోయాడు.
  .
  ఆ రాత్రి కలలు కంటూ నిద్రపోయిన అరవింద్,తెల్లారి లేచేసరికి,ఒక ఆడదానిగా కళ్ళు తెరిచాడు,చూస్తే తన భార్యలా మారిపోయాడు.
  మొహం కూడా కడుక్కోకుండానే వంటింట్లోకి వెళ్ళి మొగుడికి బ్రేకఫాస్ట్ తయారు చేసాడు. పిల్లల్నిలేపి మొహాలు కడిగించాడు. స్నానాలు చేయించి స్కూలు యూనిఫారాలు వేయించి టిఫిన్ తినిపించి,మధ్యాహ్న భోజనం బాక్సుల్లో సర్ది,వాళ్లని స్కూల్లో దింపి, తిరిగివస్తూ పచారీ సామాను దుకాణంలో ఇంటికి కావలసినవి కొనుక్కుని తిరిగి వచ్చేసరికి ఇంట్లో తీరికలేని పని సిద్దంగా వుంది.
  ఉతకాల్సిన దుస్తులు వాషింగు మెషిన్ లో వేసి,
  అంట్ల గిన్నెలు కడిగి, ఇల్లంతా తుడిచి అన్నం పళ్ళెం ముందు పెట్టుకునేసరికి పిల్లలు ఇంటికి వచ్చే సమయం అయింది.
  ఆదరాబాదరాగా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకుని, స్కూలుకి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి బట్టలు మార్పించి నాలుగు తినుబండారాలు వాళ్ల ముందు పెట్టి,
  ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసి టైం చూసుకుంటే సాయంత్రం ఆరుగంటలు.
  ఆయన ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయం. లేచివెళ్ళి వేడిగా పకోడీలు చేసి,కాఫీ డికాషన్ సిద్దం చేసేసరికి ఉస్సురుస్సురంటూ పతి దేవులు తయారు. మళ్ళీ వొంటిట్లో దూరితే రాత్రి భోజనాలు తయారుచేసే పని.
  కుక్కర్ స్టవ్ మీదకు ఎక్కించి చూస్తే పెరుగు తోడుకోలేదు. అదిలేకపోతే పిల్లలకు ముద్ద దిగదు. పరుగు పరుగున బజారుకు వెళ్ళి డబ్బా పెరుగు కొనుక్కువచ్చి పిల్లలకు తినిపించి పడుకోబెట్టేసరికి రెండో మూడో పెగ్గులు బిగించిన భర్తగారు ఆవురావురుమంటూ అన్నానికి సిద్ధం.
  ఆయనకు పెట్టి, నాలుగు మెతుకులు తాను కొరికి,
  అంట్ల పళ్ళేలు సింకులోవేసి,
  వంటిల్లు తుడిచి చీర మార్చుకుని,
  తలలో పూలు తురుముకుని పడక గది చేరేసరికి పదిగంటలు.
  నడుం వాలుద్దామంటే మొగుడు వూరుకునే మొగుడు కాదాయె.అలా రోజంతా అందర్నీ కనుక్కుంటూ, అందరికీ అన్నీ చేసిపెట్టి, చూసిపెట్టి కునుకుతీసి లేచేసరికి మళ్ళీ బండెడు పని, ఇంటెడు చాకిరీ చెప్పాపెట్టకుండా తయారు.
  .
  "అమ్మో యేమో అనుకున్నాను.
  భార్యలు కాలు మీద కాలు వేసుకుని టీవీలు చూడడమే వాళ్ల పని అనుకున్నా కాని,
  వాళ్లకు వొళ్ళు విరిగే ఇంత పని వుంటుందని కలలో కూడా అనుకోలేదు"
  .
  అరవింద్ ఆలోచనలు ఇలా సాగుతుండగానే అతగాడికి పరమేశ్వరుడు ఇచ్చిన ఒక్క రోజు వరం జ్ఞాపకం వచ్చి ఓకే! ఒక్కరోజే కదా! ఇవ్వాల్టితో ఆ వరం అయిపోతుందని సంతోషించాడు.
  కాని అది ఎంతో సేపు నిలవలేదు.
  తూరుపు తెల్లారుతున్నా చీరే జాకెట్ తో తన ఆకారం ఏమీ మారకపోవడం గమనించి,
  కంగారు పడిపోయి మళ్ళీ పరమేశ్వర ప్రార్ధన మొదలు పెట్టాడు. కాకపోతే ఈసారి అట్టే ఆలస్యం చేయకుండా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు.
  రోజు గడిచిపోయిందనీ, ముందు చెప్పిన విధంగా తిరిగి తనకు పాత మగ రోజులు ప్రసాదించమనీ కోరాడు. అందుకు ఆయన నోరారా నవ్వుతూ ఇలా అన్నాడు.
  .
  "నీ కోరిక తీరాలంటే మరో తొమ్మిది నెలలు ఆగాలి.
  రాత్రి నీకు సరిగ్గా తెలియదుగానీ నువ్వు "నెలతప్పి" గర్భవతివయ్యావు.
  అందుచేత ఆడవాళ్ళు పడే ప్రసవ వేదన యెంత భయంకరంగా వుంటుందో అదీ తెలుసుకునే మహత్తర వరం నీకు అదనంగా ఇస్తున్నాను"
  అంటూ అదృశ్యం అయిపోయాడు.
  .
  అరవింద్ కొయ్యబారిపోయాడు, దిమ్మతిరిగింది,
  ఏం అనుకుంటే ఏం జరిగిందని షాక్ లో ఉన్నాడు..
  మనమేం చేస్తున్నామో అది ఆలోచించాలిగానీ,
  మనవాళ్లు ఏదో చేస్తున్నారని అసూయ పడితే ఏం
  జరుగుతుందో బాగా తెలిసొచ్చింది.
  .
  నీతి: దేవుడు తేరగా దొరికాడని లేనిపోని వరాలు కోరరాదు...ముఖ్యంగా భార్య, అమ్మ విషయంలో..
  ఈ కథ అబద్దం కావచ్చేమో, భార్య పడే కష్టం అబద్దం కాదని తెలియజేస్తూ...నమస్తే
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  అందమైన కనులున్న
  ఓ మృగనయనీ ...

  నీ కొసం పడుతున్న బాధ
  కుడా ఆనందంగా ఉంది

  ఎందుకో తెలుసా...

  ఆ బాధలొ ఉండేది
  నువ్వే కదరా ...

  ... శుభోదయం
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  ఆమె ఆ పార్టీలో స్పెషల్ గా ఉంది . అందరి చూపులూ ఆమె మీదే .. అతను ఒక సాదా సీదా మనిషి . ఎవరూ అతడిని గమనించడమే లేదు

  పార్టీ చివరికి వచ్చేసింది . " కాఫీ తాగుదామా !" పిలిచాడు అతను
  ఆశ్చర్య పోయింది . అయినా అంగీకరించింది
  అతడికి నోట మాట రావటం లేదు . ఆమెకు ముళ్ళమీద కూర్చున్నట్టు ఉంది
  సడెన్ గా అతడు వైటర్ ని పిలిచాడు .
  " కొంచెం ఉప్పు తెచ్చిపెట్టు . నేను కాఫీ లో వేసుకుంటాను " అందరూ అతన్కేసి ఆశ్చర్యంగా చూశారు . అతడి మొహం ఎర్రబడి పోయింది . ఉప్పు వేసిన ఆ కాఫీ తాగేశాడు .
  ఆమె కుతూహలంగా కాఫీ లో ఉప్పు గురించి అడిగింది
  " నేను చిన్నప్పుడు సముద్రం ఒడ్డున ఉండేవాడిని . రోజూ ఉప్పు రుచి చూసేవాడిని . కాఫీలో ఇలా ఉప్పు వేసుకుంటే నాకు నా చిన్నతనం , అమ్మా , నాన్నా అందరూ గుర్తుకు వస్తూ ఉంటారు " అన్నాడు
  ఆమె కూడా తన చిన్నతనం తల్లితండ్రులు తన ఊరూ అన్నీ చెప్పింది .
  అలా మొదలైంది . ఈ కధ.
  ఆమె కు అతడు నచ్చాడు . ఉప్పు కాఫీ వలన తను తన జీవితం లో ఒక అద్భుత వ్యక్తిని కలుసుకున్నాననీ లేదంటే తనను అర్ధం చేసుకునే ఇంతటి మంచి వ్యక్తిని కోల్పోయేదాన్ని అనీ అనుకుందామే. డేటింగ్ .... వివాహం .... అద్భుతమైన జంట .
  .

  రోజూ ఉదయమే అతడికి ఇష్టమైన ఉప్పు కాఫీ తో మొదలయ్యి ఆనందంగా ఈ కధ మిగిలిన అన్ని కధల్లా హాయిగా గడిచింది .
  40 ఏళ్ళు గడిచాయి .
  .
  అతడు చనిపోయాడు . ఒక ఉత్తరం రాశాడు ఆమెకు .
  .
  " ప్రియా ! నీకు గుర్తుందా ! నేను నిన్ను చూసిన మొదటి రోజు కాఫీ లో కలుపుకోడానికి ఉప్పు అడిగాను . నేను అడగదలచుకొన్నది షుగర్ కానీ ఉప్పు అనేశాను . మార్చదలచుకోలేదు . అందుకే కధ అల్లాను .. అదే మన కధకు మూలం అవుతుందని అనుకోలేదు .
  " నేను నీకు నిజం చెప్పాలని ఎన్నో సార్లు అనుకున్నాను భయపడ్డాను . కానీ నీకు మాట ఇచ్చాను నీతో అబద్ధాలు చెప్పనని "
  " నేనిప్పుడు చనిపోతున్నా . నేను ఎవరికీ భయపడనక్కరలేదు . నీకిప్పుడు నిజం చెబుతున్నాను . నాకు ఉప్పు కాఫీ అస్సలు నచ్చదు . కానీ జీవితం అంతా ఉప్పు కాఫీ తాగాను . అయితే అలా తాగినందుకు నేను బాధ పడటం లేదు . మళ్ళీ జన్మ అంటూ ఉంటె అప్పుడు కూడా నువ్వే నాభార్యవు అయితే నీకోసం వచ్చే జన్మలో కూడా ఉప్పు కాఫీ తాగడానికి నేను సిద్ధం ."
  .
  .
  .
  ఆమె కళ్ళనుండి జలజలా కన్నీళ్లు రాలుతూనే ఉన్నాయి
  .
  .
  .
  ఒక రోజు ఎవరో అడిగారు
  .
  " ఉప్పు కాఫీ ఎలా ఉంటుందండీ "
  .
  " తియ్యగా " అంది ఆమె
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  రోజు ఒక గ్లాసుడు నీళ్ళుపోస్తే ప్రతిరోజు దోసెడు పువ్వులిస్తుంది మల్లెతీగ....
  చిన్న ఆదారం చూపితే అల్లుకుపొతుంది మనీప్లాంటు....
  వాడిపోయాక కూడా గదినంతా పరిమళంతో నింపుతుంది సంపెంగ....
  కానీ స్త్రీతో పోల్చుకుంటే ఇవన్నీ ఏపాటివి....
  రవ్వంత అప్యాయత, కాస్తంత సెక్యూరిటీ, నీకు నేనున్నాను అనే భావన కలిగిస్తే మల్లెకన్నా ఎక్కువ ప్రేమ అందిస్తుంది.
  మనీప్లాంటు కన్నా గాఢంగా అల్లుకుపోయి, సంపెంగ కన్నా అప్యాయత పరిమళాలతో జీవితాన్నీ మీకు అందిస్తుంది...
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • Post is under moderation
  మాతృభాషా దినోత్సవ సందర్భంగా

  (తెలుగు)

  కదిలిపోతోంది సమాజం
  కరిగిపోతోంది నిజం

  తెలుగనేది అమృతమైంది
  విషపుచుక్క ఆంగ్లమైంది
  తెలుగు భాష
  ఆవిరైపోతోంది

  తెలుగు విత్తనం మొలకెత్తి
  సాహిత్యమనే పంటనిస్తోంది
  అంగ్లమనే చీడ ఒకటి
  పంటనే తినేస్తోంది
  కనుమరుగవుతోంది సాహిత్యపు పంట

  వ్యాకరణాలనే ప్రాకారాలు కట్టి
  ఛందస్సు అనే గూఢచారులతో
  అలంకారాల సైన్యంతో
  తెలుగు తల్లి రాణీయై రాజ్యమేలుతోంది
  సైన్యంలో ఆంగ్ల శత్రువు ప్రవేశించి
  రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తోంది
  Stream item published successfully. Item will now be visible on your stream.