Comments (1)

Rated 0 out of 5 based on 0 voters
  1. srujan
  1. 5 / 5

భారతదేశంలో జమిందారీలకు పుట్టినిల్లు బెంగాల్.
శరత్చంద్ర చటర్జీ జీవించినకాలం 15-9-1876నించి 16-1-1938 .
ఆసమయంలోస్వాతంత్ర కాంక్షవల్ల కొత్త,కొత్తగా తలెత్తిన
ఓ కులీన వర్గ సంస్కృతిని ,పల్లీయుల సమాజం లోని సంస్కృ తిని
వాటిలోని వైరుధ్యాలనీ శరత్ చూసి చక్కగా తన రచనల్లో
మనకి చూపించాడు.శరత్ చంద్రుడు తన 20 యేళ్ళలోపు
తను రచనలు ప్రారంభించినప్పుడు రాసిన నవలల్లో ఈ దేవదాసు ఒకటి.
శరత్ బాబు బర్మాలో 1913 నుండి తన మిత్రులకి రాసిన లేఖలో “దేవదాసు సంతృప్తికరంగా లేదు ,దీన్ని ప్రచురించటం ఇష్టం లేదు దాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు నాకు సిగ్గనిపిస్తూ ఉంది అనైతికంగా ఉంది ,అందులో ఒక వేశ్య కూడా ఉంది” అని రాసాడట.
“క్షీణ మానమైన శిధిలమవుతున్న ఒక వర్గానికి సహజ ప్రతినిధే దేవదాసు” అన్నారు శ్రీ శివనాధ బెనర్జీ గారు.
పార్వతి,దేవదాసు,చున్నీలాల్, చంద్రముఖి పాత్రలే నవలను నడిపిస్తాయి..
పార్వతి దేవదాసును “దేవదా” అని పిలుస్తుంది
బెంగాలీలో ‘దా” అని కలిపి సంబోధిస్తే ‘అన్నగారు ‘ అన్న అర్ధం వస్తుంది .
దేవదా అంటే దేవ దాసు అన్నయ్య అనే అర్ధమే కదా వచ్చేది.
ఈ ఆర్ధిక సామాజిక సమస్యలెలా ఉన్నా
,కన్యలని అమ్ముకునే వంశం లోని పిల్ల అన్నది ఇక్కడ ముఖ్యమైన మలుపు.
చలనచిత్రంలో చూపించినట్లు .దేవదాసు చిన్నవయసులో మరణించలేదు.
ఎలా బతకాలో తెలీక ఒకరి మీద ఆధారపడి బతికే వ్యక్తి దేవదాసు .
పార్వతి పెళ్ళి నారాయణ ముఖర్జీ (దేవదాసు తండ్రి )దగ్గరుండి జరిపిస్తాడు.
పార్వతి పెళ్ళి అయ్యాక తను అప్పుడు అర్ధం చేసుకుంటాడు తనకి కావలసినదేమిటో.
కలకత్తాలో ఒక మెస్ లో పరిచయమౌతాడు చున్నీలాల్.
దేవదాసు చదువుకోసం కలకత్తా పంపినప్పుదు పక్కరూం లో ఉంటాడు చున్నీలాల్.
దేవదాసు ఒక ఖాళీ వైన్ గ్లాసు లాంటి వాడు.. ఏద్రవం పోసినా నిండుతుంది ,
1938 లో శ్రీ ప్రమధేశ్ బారువా బెంగాలీలో దేవదాస్ చలన చిత్రం తీసినప్పటి నించీ
దాదాపు 10 ,15 చిత్రలు వివిధ భాషల్లో వచ్చాయి,
మూల కధకి చిత్ర కథకి చాలా వ్యత్యాసం ఉంది.
ఒక పిరికివాడు, చాతకానివాడు, అర్భకుడు,తాగు బోతుని, మంచి ప్రేమికుడు అని ఒక పెద్ద కథా నాయకుణ్ణి చేసేసారు.
చంద్రముఖి పాత్ర ఇందులో చాలా ఉదాత్తంగా దిద్దారు శరత్ చంద్రుడు,
అలాగే పార్వతి కూడా మంచి ఇల్లాలనిపించు కుంది, తన చిన్ననాటి స్నేహితుడు
తన అత్తవారి ఊరిలో అనుకోని విధంగా ప్రాణలు కోల్పోయాడని పిచ్చిదౌతుంది.
తన సర్వస్వమూ దేవదాసు కోసం వెచ్చించి తన వృత్తినే మార్చుకుని అగ్ఞాతంలోకి
వెళ్ళి పోతుంది చంద్రముఖి .
భువన చంద్రుడు పార్వతి భర్త .పెద్ద జమిందారు , బహు సంతాన వంతుడు .
పార్వతి తనకంటే పెద్దవారైన సవతి కొడుకుల పెళ్ళిళ్ళు చేసి మంచి అత్త గారౌతుంది నవలలో .
నవలలో పార్వతి చని పోయినట్లు రాయలేదు , పిచ్చిది ఔతుంది అంతే. చేతకాని వాడిని ప్రేమించిన స్త్రీ జీవితం చివరికి ఏమవుతుందో చక్కగా చెప్పారు శరత్.
అందరూ చదవవలసిన పుస్తకము.*
– రామ సుధ పప్పు

  Attachments
 
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

Login Here