Comments (1)

Rated 0 out of 5 based on 0 voters
  1. zilebi
  1. 5 / 5

అన్నా కరేనినా!!!
Uma Nuthakki సమీక్ష

డిగ్రీ చదువుతుండగా అనుకుంటా మొదటిసారి కాలేజ్ లైబ్రరీలో చదివాను. పుస్తకం.. మొదటి పేజీ తిప్పగానే "సుఖపడే సంసారాలన్నీ ఒక లాగే ఉంటాయి. సుఖంలేని సంసారాలు మాత్రం దేని బాధలు దానివి" అన్న వాక్యం కనిపించింది. సుఖదుఃఖాలు.. అవి ఉండడాలు లేక పోవడాలు ఇలా వేటిమీదా పెద్దగా అవగాహన లేని రోజులవి. కాని "అన్నా కరేనినా" గుర్తు వచ్చినప్పుడల్లా ఈ వాక్యం గుర్తుకు వచ్చి గమ్మత్తుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇన్నిరోజుల తర్వాత అన్నా కరేనినా చదవగానే సముద్రపుటలల్లో కాళ్ళుతడుపుకున్న వింత అనుభూతి.
కధ గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే.. అన్నా కరేనినా అనే ఒక ఉన్నత వర్గానికి చెందిన మహిళ తన వివాహ బంధాన్ని అతిక్రమించడం.. దానివల్ల రేగిన మొత్తం ఘటనలు.. గా చెప్పుకోవచ్చు. కానీ నవలలో అంతర్గతంగా ఉన్న అర్ధం "కుటుంబ గాధను" మించి ఉంటుంది. చక్కటి సంసారం ఉన్న కరేనినా.. కొన్ని పరిస్థితుల ప్రభావంతో.. వ్రాన్‌స్కీ ప్రేమలో పడడం. ఆ తర్వాత కరేనినా పాత్ర అనుభవించే సంఘర్షణ.. కన్న కొడుకు దూరమై ఆమె మానసికంగా పదే వేదన.. చివరికి ఆమె ఆత్మ హత్య చేసుకోవడంతో కధ ముగుస్తుంది. అన్నా కరేనినా పాత్ర పడే సంఘర్షణతో పాటుగా, వివిధ పాత్రల ఆలోచనలు, సమాజాన్ని పతనం చేస్తున్న భూస్వామ్య వ్యవస్థ మూలాలను చర్చిస్తాడు టాల్‌స్టాయ్. భూస్వామ్య వ్యవస్థ పునాదులు కదిలిన దశలో అన్నా లాంటి వ్యక్తుల జీవితాలు తుఫానులో ఎండిన ఆకుల్లా ఎలా కొట్టుకు పోయాయో కళ్ళకు కట్టినట్లు చెప్తాడు టాల్‌స్టాయ్.
మారుతున్న పరిస్థితుల గురించి, వర్గ సంబంధాల గురించి, వ్యవసాయ సంస్కరణల గురించి సుదీర్ఘమైన చర్చ ఉంటుంది ఈ నవల లో.
టాల్‌స్టాయ్ మాస్టర్ పీస్ లలో "అన్నా కరేనినా" ఒకటి.
టాల్‌స్టాయ్ ఒక సందర్భంలో అన్నా కరేనినా గురించి మాటాడుతూ.. " నేను రాసిన ఈ పుస్తకాన్ని ఒక ఇరవై ఏళ్ళ తర్వాత పిల్లలు చదువుతారనీ.. వాళ్ళు ఏడ్చి.. నవ్వి.. ఈ పుస్తకాన్ని.. తద్వారా.. తమ జీవితాన్ని ప్రేమిస్తారని నాకు గనక తెలిస్తే నా సర్వ శక్తుల్నీ దానికే అంకితం చేసేవాడిని" అన్నారట..
టాల్‌స్టాయ్!! ఇరవై ఏళ్ళు ఏమిటి.. రెండువందల ఏళ్ళతర్వాత పుట్టిన వాళ్ళం మేం. మీ రచనలు చదువుతున్నాం.. తద్వారా.. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నాం.

  Attachments
 
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

Login Here