Introduction
Friends (3)
Mutual Friends (0)
No mutual friends yet
Groups (0)
No groups yet
Pinned Items
Recent Activities
 •   sanju.ruthvik2 reacted to this post about 8 hours ago
  మనసా మన్నించవే ....నన్నే నిదించకే!
  కనబడని నీవు పన్నీరు, కన్నీరు చిదించకే....
  ఆనందాలలో పన్నీరు లా
  దుఃఖాలలో కన్నీరు లా
  కనబడే నీవు అన్నీంటికి అందని ఆకాశం లా
  దోబుచులాడుతావు
  అందరికీ చేరువా అవుతావు ,దూరం అవుతావు
  కరుణిస్తావు ,కరిగిస్తావు
  ఏడిపిస్తావు ,ఏడుస్తావు
  అన్నింట్లో నీదే పై చేయి మనసా...ఓమనసా!


  మనసా కవ్వించకే మనిషి లో ని మనసు ను బాధించకే.............
  మనసా కవ్వించకే నీలో ని బావాలు పలికించకే ......
  నీవు లేని మనిషి లేడు నీది కానీ బావన లేదు.
  నీవు లేని నేను లేను.....నేను లేని నీవు లేవు.
  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 •   kiranmai.telurinn reacted to this post about 3 days ago
  …గొప్ప నీతి కథ…

  పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు..
  '
  ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు..

  రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు.

  ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు..
  చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు..

  వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు..

  సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు..

  మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలూ స్థాపించారు..

  రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు..

  దానికి ఆరాజు గారిలా అడిగారు.. ఏమయ్యా మీ రాజుకి దాన గుణం‌లేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు..

  దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు..

  హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామ‌ంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు..‌ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..‌ఇంక మారాజుగారికా అవకాశం ఎలఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ అని.

  వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు.

  పాలకుల పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం ఆ దేశం.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
  ఎవరి వారు గొప్ప వారు అనుకుంటే సరిపోదు.
  అది మనం చేసే పనుల్లో ఉండాలి. అందరిలో మంచి గా ఉండాలి. మంచి తనం అనేదిమన గుణం లో ఉండాలి
  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 •   parineeta reacted to this post about 3 days ago
  ఉషోదయాన ఉషస్సు లా
  వేసవి లో పిల్ల తేమ్మారలా
  నా మది ని చేరిన నీ తలుపు లు
  నాకు ఊపిరి ని ఇస్తున్నాయి నీ ఊహలతో నిను తలచి
  తలచి అలసిన మనసు...
  విహంగ మై విహరిస్తూ మనసనే రెక్కల తో
  నిను చేరుకుని మురిసి మురిసి తరిస్తూన్నది.


  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 •   parineeta commented on this post about 3 days ago
  అవని పైకి కొచ్చాను అందాల జాబిలి గా
  మెచ్చుకొన్నారు కొందరు వద్దాన్నారు కొందరు
  నేను చేసిన తప్పు ఏమిటో నాకే తెలియదు
  అందమైన దానిని అని పొగిడారు కొందరు
  అందుకోవాలని చూశారు కొందరు.....
  అందనంత దూరంలో ఉంటేనే విలువ నాకు
  అందితే మాత్రం మచ్చలే వస్తాయి నాకు
  నేను లేనిదే సృష్టి లేదంటారు.సృష్టకి
  విరుద్ధమైన పనులు చేస్తుంటారు
  నాతో....
  నేను చేసిన తప్పు ఏమిటో నా కే తెలియదు
  బంగారు పంజరంలో బంధీస్తారు నన్ను
  విలువ లేదని సంధీస్తారు నన్ను
  అందరికీ నచ్చేనేను ,అలుసైపోయాను
  అందరి అవసరాలు తీర్చే మరబొమ్మానైనాను
  అయినా నేను చేసిన తప్పు ఏంటో నాకే తెలియదు
  నేను లేనిదే ఇంటికి కళ లేదు అంటారు
  కళ తేచ్చే నన్ను కాటికే పంపుతారు
  పసిపాప గా ,పడతిగా ,లలన ,మగువ గా ఎన్ని
  పాత్రలు మార్చి అలసిపోయిన గాని అయ్యె పాపం
  అనే వారు లేరు గా......
  అయినా తెలియదు నాకు నేను చేసిన తప్పేంటో
  ఈబంధనాల విముక్తిలో అలసి సొలసి పోయాను
  ఆడపిల్లగా పుట్టినందుకు అశ్రువులు రాలుస్తూన్నాను
  అయినా నేను చేసిన తప్పేంటో నాకే తెలియదు.

  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 •   parineeta commented on this post about 3 days ago
  Title:నీకు తెలుసా.........!
  ఉదయించే భానుడికి తెలుసు ప్రతి వేకువ తనదేననీ
  నిదురించే రేరాజు కు తెలుసు ప్రతి రాత్రి తనదేనని
  ఎగిసిపడే కెరటానికి తెలుసు ప్రతి పయనం వెనుక కేననీ
  గర్జించే మేఘానికి తెలుసు ప్రతి చినుకు అవని పైకేననీ
  వీచే గాలి కి తెలుసు ప్రతి ఊపిరి ని నిలపాలని
  మరి మనిషి గా జన్మించిన నీకు తెలుసా ఈర్ష్య ద్వేషాలను వదిలి అందరి లో ఒక్క రిగా ,ఒక్క రిలో అందరిగా జీవించాలని............
  మనిషి అంటే తన కోసం కాక ఇతరుల కోసం బ్రతకాలని.........
  మరణించిన కాని అందరిలో జీవించాలని..........
  నీకు తెలుసా!
  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 •   kalpitha commented on this post about 4 days ago
  Beautiful lines from

  MahaKavi Sri Sri,


  కుదిరితే పరిగెత్తు.. ,

  లేకపోతే నడువు...

  అదీ చేతకాకపోతే...

  పాకుతూ పో.... ,

  అంతేకానీ ఒకే చోట అలా

  కదలకుండా ఉండిపోకు...

  ఉద్యోగం రాలేదని,

  వ్యాపారం దెబ్బతినిందని,

  'స్నేహితుడొకడు మోసం

  చేశాడని,'

  ప్రేమించినవాళ్ళు వదిలి

  వెళ్ళి పోయారని...

  అలాగే ఉండిపోతే ఎలా?

  దేహానికి తప్ప,

  దాహానికి పనికిరాని

  ఆ సముద్రపు కెరటాలే

  ఎగిసి ఎగిసి పడుతుంటే...

  తలుచుకుంటే...

  నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు

  కూడా...

  నీ ముందు తలదించుకునేలా

  చేయగల సత్తా నీది,

  అలాంటిది ఇప్పుడొచ్చిన

  ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే

  ఎలా?

  సృష్టిలో చలనం ఉన్నది

  ఏదీ ఆగిపోకూడదు...,

  పారే నది..,

  వీచే గాలి...,

  ఊగే చెట్టు...,

  ఉదయించే సూర్యుడు....

  అనుకున్నది సాధించాలని

  నీలో కసికసిగా ప్రవహిస్తుందే

  ఆ నెత్తురుతో సహా....,,

  ఏదీ ఏది ఆగిపోడానికి

  వీల్లేదు..,

  లే...

  బయలుదేరు...

  నిన్ను కదలనివ్వకుండా చేసిన

  ఆ మానసిక భాదల

  సంకెళ్ళను తెంచేసుకో... ,

  పడ్డ చోటు నుండే పరుగు

  మొదలుపెట్టు...

  నువ్వు పడుకునే పరుపు...

  నిన్ను చీదరించుకోకముందే

  బద్దకాన్ని వదిలేయ్... ,

  నీ అద్దం....

  నిన్ను ప్రశ్నించకముందే

  సమాదానం వెతుక్కో... ,

  నీ నీడ నిన్ను

  వదిలేయకముందే వెలుగులోకి

  వచ్చేయ్..,

  మళ్ళీ చెప్తున్నా...

  కన్నీళ్ళు కారిస్తే కాదు...,

  చెమట చుక్కని చిందిస్తేనే

  చరిత్రను రాయగలవని

  తెలుసుకో..

  *చదివితే ఇవి పదాలు

  మాత్రమే,

  ఆచరిస్తే...

  అస్త్రాలు.

  -SriSri
  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • 0
  0
  0
  0
  0
  0
  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 • రెండక్షరాల జీవితం
  -------------------------------
  "భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి
  ,,"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని
  రెండక్షరాల "అవ్వ "తాత "
  "అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "
  అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ
  రెండక్షరాల "గురు " వు దగ్గర
  రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని
  రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి
  రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే
  బంధాలను ఏర్పరచుకొని
  రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ
  రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ
  రెండక్షరాల "బాధ "ని భరిస్తూ
  రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని
  రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి
  రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి
  రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ
  రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ
  రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ
  రెండక్షరాల "ముప్పు " వచ్చి
  రెండక్షరాల "చావు " వచ్చే వరకు
  రెండక్షరాల "ముఖం "పైన
  రెండక్షరాల "నవ్వు "ఉంటే
  రెండక్షరాల "స్వర్గం "మన
  అరచేతిలో ఉన్నట్లే..!!
  ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే అదే జీవితం ....
  0
  0
  0
  0
  0
  0
  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 •   Srinu75 reacted to this post about 1 week ago
  మౌనం మాట్లాడితే లిపి లేని మాటలేన్నో
  కాలం కాసేపు ఆగితే కనపడని కలతలేన్నో
  గతానికి గడువు నిస్తే మరపురాని గుర్తులేన్నో
  కమ్మని కల వస్తే నిద్రించిన రాత్రులేన్నో
  బాధ లను మరవనిస్తే,కన్నీటి వీడ్కోలు లేన్నో
  ఆనందాలు గుర్తోస్తే ,వికసించే నవ్వు లేన్నో
  నిన్న టినీ వదిలేస్తే ,రేపటి రోజులేన్నో మలచి
  కానుకలుగా వచ్చే స్తే మిగిలిపోయే మధురిమలేన్నో……..!
  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
 •   sindhu.ch reacted to this post about 1 month ago
  *ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*

  *ఒక రోజు , ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !*
  *మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*

  *అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :- బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు . నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .*
  *వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు .*
  *ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*
  *నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను .*
  *అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*

  *అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? "*

  *ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల 🗓 నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .*

  *సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .*

  *మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .*
  *ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*
  *ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*

  *ఆ ముసలావిడకు చదువు రాదు .*
  *అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .*


  *కానీ , మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*

  *మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది .*

  *కానీ , మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*
  *మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం.

  విలువ వైన వి ఎన్ని ఉన్నా విలువ తెలియనప్పుడు
  వృధాయే కదా!  Post is under moderation
  Stream item published successfully. Item will now be visible on your stream.
There are no activities here yet
Unable to load tooltip content.