Comments (2)

Rated 5 out of 5 based on 1 voters
  1. chimate

Many Thanks for providing this award winning novel

  Attachments
 
  1. sundark
  1. 5 / 5

అంపశయ్య నవీన్ 2002 లో రాసిన కాలరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
1944 నుండి 1995 వరకు తెలంగాణా ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర.
ఆంధ్రమహాసభ దగ్గర మొదలై ఆంధ్రప్రదేశ్ అవతరణలో ముగుస్తుంది. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం, విశాలాంధ్ర భావన, భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు, ముల్కీ ఉద్యమం, దొరలు మళ్లీ గడీలకు రావడం, వినోభాబావే భూదానోద్యమ విషయాలు, కమ్యూనిస్టు, కాంగ్రెస్ రాజకీయాలు, ప్రజాపోరాటాలు, రజాకార్ల ఉద్ధేశాలు, సంగం కార్యకలాపాలు, పోలీస్ చర్య, 1952 నాటి జనరల్ ఎలక్షన్లు, తెలంగాణ గ్రామీణ జీవితానికి చెందిన సాంస్కృతికాంశాలు, మొదలగు విషయాలు నవలలో కనపడతాయి. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక రాజకీయ చరిత్రకు ఈ నవల దర్పణంగా నిలుస్తుంది.
కల్లాకపటం ఎరుగని ఓ బాలుని దృక్కోణం నుంచి కథను నడపడంతో ఇందులో మరింత స్వచ్ఛత, పరిశీలన, కుతూహలం, తెలుసుకోవాలన్న జిజ్ఞాసా ధోరణి కనిపిస్తుంది. పాఠకుడు ఆ ధార వెంట ముందుకుపోతూ ఉంటాడు. కథనంలో పాత్రలు ఆయా సన్నివేశాలలో, ఆయా విషయాల గురించి ఘర్షిస్తాయే కాని, ఎక్కడా లాలూచీ పడవు.
రజాకార్లు అనేది ఉర్దూపదం. రజాకార్లు అంటే అసలు అర్థం వాలంటీర్లు. కాని రజాకార్ల దుర్మార్గ కార్యక్రమాలను ప్రజలు అసహ్యించుకోవడంతో రజాకార్లు అంటే దుర్మార్గులు అనే అర్థం ప్రజలలో ప్రబలింది. ఈ నవలలో రజాకార్ల వ్యవవాహర సరళిని రచయిత వివరించారు. కాలరేఖలు' ఒక నవలకాదు. ఇది సాంఘికాచారాలకు దర్పణం, చారిత్రక సంఘటనల కాసారం. నాటి నిజాం నవాబు రాచరిక వ్యవస్థకు సజీవసాక్ష్యం.

  Attachments
 
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

Login Here