Comments (5)

Rated 0 out of 5 based on 0 voters
  1. srujan
  1. 5 / 5

బుచ్చిబాబు,’చివరకు మిగిలేది’….రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలపు కథ….గ్రూప్ II పరీక్షలకు ఈ బుక్ ఎన్నికయిందట.
తన తల్లిని గురించి సమాజంలో చాటుచాటుగా నీతికీ అవినీతికీ సంబంధంలేని కథలేవో ప్రచారమవుతుండగా వింటున్న కొడుకు జీవితం ఎన్ని విధాల కుంటుబడిపోతుందో ఈ నవలలో ప్రస్తావించారు. ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పు వలన పిల్లల జీవితం లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న సమస్య పైన ఈ నవల వ్రాసారు రచయత . ఇందులోని నాయకుడు దయానిధిని అతని తల్లి చేసిన అపచారాల ఫలితం అతనిని నీడలా వెంటాడి , అనేక అనుభవాలు ఏకాకిని చేస్తాయి. అతన్ని చుట్టుముట్టుతాయి. ప్రేమరాహిత్య ప్రవాహంలో పడిపోతాడు.కొత్త జీవితం కోసం అనేక ప్రాంతాల్లో నివసిస్తాడు. అతనేమీ సాధించలేడు. కాని సాధించలేకపోయానన్న జిజ్ఞాస అతన్ని నిస్పృహ పరచదు. కన్నతల్లి, కోమలి, నాగమణి, సుశీల, రోజ్, శ్యామల, అమృతం, ఇందిర, కాత్యాయని అతని జీవితాన్ని ప్రభావితం చేస్తారు. ఇదీ ఇందులో కథ.
ఇందులో ‘చీకటి సమస్య ‘ అన్న అధ్యాయాన్ని తప్పక చదవాలి.
చివరకు మిగిలేది ఏమిటి? దేని చివరకు ? ఎవరికి ? వ్యక్తికా ? జీవితానికా ? సమాజానికా ? దీనికి సమాధానం వెతకటం సులభమా? ఇవన్నీ ఈ నవల చదవటం ముగించాక కలిగే ప్రశ్నలు!
ఈ నవల చాలా మంచి నవల అని విని చదివాను. అదేమిటో రెండు సార్లు చదివినా నాకు పూర్తిగా అర్ధం కాలేదు. మనసంతా బరువుగా మారిపోయింది. మళ్ళీ తీసి అక్కడక్కడ చదివాను.ఎన్ని సార్లు చదివినా ఇంతకన్న ఎక్కువగా దీని గురించి వ్రాయలేక పోతున్నాను.కాకపోతే డెభై ఏళ్ళ క్రితం వ్రాసినదైనా భాష ఇప్పటి వ్యవహారిక శైలి లోనే వుండటం వలన సులభంగా చదవగలిగాను. ఇది ఎవరికి వారు చదివి విశ్లేషించుకోవలసిన నవల.

– మాలా కుమార్

  Attachments
 
  1. D2C
  1. 5 / 5

నేను తెలుగు సాహిత్యంలో కొంచెం వీకు . నాకు బుచ్చిబాబు అంటే “చివరకు మిగిలేది” తెలుసు అంతే . మొన్నామధ్యన ఈ నవల చదవటం జరిగినది . నాకు నచ్చినది కనుక ఈ నవల గురించి పది మందికి తెలియజెప్పాలని ఇదిగో పుస్తకం.నెట్లో ఇలా రాయవలసి వచ్చింది.

ఇక కథ విషయానికి వస్తే .. కథానాయకుడు దయానిధి జీవితం తాలూకా కష్టాలూ , సుఖాలు , ప్రశ్నలు , సవాళ్ళూ … (అంటే సవాల్ ఔర్ జవాబ్ లో సవాల్ కాదు ! .. బస్తీ మే సవాల్ లో సవాల్ ! ).. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే మనుషులు .. అతన్ని నీడలా వెంటాడే అతని గతం ..ఆడుగడుగునా సంఘం నుంచి అతనికి ఎదురయ్యే ఛీత్కారాలు .. ఇవన్ని కలిపి ఒన్ టు థ్రీ మహరజ మిక్సిలో కలిపేస్తే కథ రెడీ . 1930-1950 ప్రాంతం కథ ఇది .

రాజమౌళి సినిమాలోలాగ ఈ నవలలో కథానాయికలకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు . అంటే ఉన్న నలుగురు హిరోయిన్లు (మరే మీరు త్తఫ్ఫుగా చదవలేదు ! .. నలుగురు !.. ఐతే అందరు మెయిన్ హీరొయిన్సు కాదు లెండి ) దయానిధి ఫాన్స్ !. దయానిధి యెం.బి.బి.యస్ చదివిన డాక్టరు . అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక తక్కువ కులం అమ్మాయితో ఒక “ఎఫైర్” (అదేంటో తెలుగులో వ్యవహారం అంటే ఆ ఫీలింగు రాదు !) నడుపుతూ ఉంటాడు . ఈ అమ్మాయి పేరు కోమలి . ఇది ప్రేమో , కామమో … కొంచెం రుచి కొంచెం చిక్కదనం లాగా కొంచెం కామం కొంచెం ప్రేమో నాకు ఆట్టే అర్థం కాలేదు !. ఈ వ్యవహారానికి దయానిధి అమ్మ తప్పితే ఇంక ఎవరి దగ్గర నుంచీ సపోర్టు దొరకదు అతనికి . కోమలి వాళ్ళ కుటుంబం మరియు దయానిధి వాళ్ళ అమ్మగారు అదో టైపు (అదేంటో తెలుగులో అదో రకం అంటే ఆ ఫీలింగు రాదు! ) అని లోకులు కూస్త్టూ ఉంటారు . తన తల్లి మరణించిన తర్వాత సంఘం నుంచి ఇటువంటి కామెంట్సు మరీ ఎక్కువ అయిపోతాయి ( శేంపిల్ : అమ్మ బుద్ధులే కొడుక్కి వచ్చాయి . లేకపొతే ఆ కోమలితో ప్రేమలు ఏంటి !).ఇదిలా సాగుతూండగా మరొక రెండు ఆడ పాత్రలు ప్రవేశ పెడతారు రచయిత… ఒకరు అమృతం.. మరొకరు సుశీల. అమృతంకి పెళ్ళి అయిపోయినా కూడా వరసకి బావ అయిన దయానిధి అంటే ఒక “ఇది” ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ “అది ఒక ఇది లే … ” ) . సుశీలకి దయానిధి అంటే ఇష్టమే కానీ దయానిధి అమృతంతోనూ మరియు కోమలితోనూ చనువుగా ఉండటం చూసి కాబోలు .. ఇష్టం బయటకి చెప్పదు . నిజానికి సుశీలకి దయానిధికి పెళ్ళి జరగటానికి ఆట్టే అడ్డంకులు లేవు అనట్టు గానే అనిపిస్తుంది . వీరు కాకుండా అమృతం తమ్ముడుగా జగన్నాథ్ పాఠకులకి కామిక్ రిలీఫ్ పంచుతాడు ( శేంపిల్ : “…. కరెక్టు జగ్గూ !” నిధి అందుకున్నాడు . జగ్గన్నాథ్ : జగ్గూ – A jug the crow and the jug – దారుణం , నాథ్ అనండి ) . నమ్మిన బంటు పాత్రలో నారయ్య … పాత సినిమాలలో జగ్గయ్య , గుమ్మడి, నాగయ్య లాగా అలరిస్తాడు ( నారయ్య అన్న పేరు వింటేనే పాత్ర అర్థం అయ్యుంటుంది చాలా మందికి ! ఇదే నవలలో కథానయకుడి పేరు “నారయ్య ” నౌకరు పేరు “దయానిధి” అంటే ఛీ అంటారేమో ! ) .

కోమలి వ్యవహారం ముదిరి పాకాన పడి, నానా గొడవ జరిగి మొత్థానికి కొన్ని పదుల పేజీలు అయ్యాక కోమలి ఇంకెవరితోనో ఊరు వదిలి పోతుంది , దయానిధికి ఇందిరతో వివాహం జరుగుతుంది . కుటుంబ కలహాలు , దయనిధి కాంగ్రెస్సువాదం , మామగారితో దాని గురించి పట్టింపులు వగైరా కారణాల వలన ఇందిరకు దూరంగా ఉండవలసి వచ్చి అతను మద్రాసులో ఒంటరిగా ప్రాక్టీసు పెడతాడు . తిరిగి మళ్ళీ రోస్ అని ఒక ఆడ అసిస్టెంట్ అతని దగ్గర జీతం లేకుండా పని చేయటం , శ్యామల అనే ఒక ఆడపేషంటు అతని ఆసుపత్రిలో కొన్ని దినములు ట్రీట్మెంట్ కోసమని ఉండటం వల్ల సంఘంలో మళ్ళీ రకరకాల పుకార్ల్లు పుడతాయి ( కోమలి , అమృతం, ఇందిర , సుశీల , రోస్ , శ్యామల , నాగమణి (సొంత ఊరిలో ఎదురింటి అమ్మాయి) – ఒక్క దయానిధికి ఇంత మందితో చనువు ఉంటే మన సంఘం ఊరుకుంటుందా ! ). ఈ పుకార్లతో ప్రాక్టీసు దెబ్బతిని దయనిధి రాయలసీమలో కొత్త జీవితం మొదలుపెడతాడు.

“నరసింహ” సినిమాలో రజనీకాంతుకు గ్రనేటు కొండ దొరికినట్టు (నిజానికి నవలే పాతది కనుక “నరసింహ” సినిమానే కాపీ అని అనుకుందాం) దయానిధికి వజ్రాలగని తాలూకు ఆనవాళ్ళు దొరకటంతో దశ తిరిగి ధనవంతుడు అయిపోతాడు ( ఇటువంటివన్నీ సినిమాలలో లేదా నవలలో మాత్రమే జరుగును !). ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిన కోమలి తిరిగి దయానిధి సరసన చేరుతుంది , వచ్చిన డబ్బుతో దయానిధి పెట్టిన ఆసుపత్రి పనులలో సాయపడుతూ , అపుడపుడూ పాత ప్రేమను గుర్తుకు తెస్తూ దయానిధితో కాలం గడుపుతూ ఉంటుంది.

సుశీల మరియు ఇందిరల మరణం , అమృతానికి ఒక బిడ్డ జన్మించటం ( ఇది దయానిధి-అమృతం ల అక్రమ సంతానం అన్నట్టుగా అనిపించటానికి కావలసినన్ని హింట్లు ఇస్తాడు రచయిత ! ) , దయానిధి మిత్రుల జీవితాలు , జగన్నాథ్ కెరీరు బాపతు వగైరా సంఘటనలు మిగిలిన పేజీలను నింపుతాయి . దయానిధి సర్కారు జిల్లా వాడు అని అతను రాయలసీమలో ఆస్తులు కలిగి ఉండకూడదని ( మన తె.రా.స కూతల మల్లే ! ) అతనికి నలుగురు పెళ్ళాలనీ అతను అంత మంచి వాడేమీ కాదని అల్లర్లు రేగటంతో నారయ్య మరణం .. దయనిధి కోమలి ఊరు వదిలి పారిపోవటంతో కథ ముగుస్తుంది.

జీవితానికి అర్థం యేమిటి ? అన్న ప్రశ్నతో మొదలు అయిన ఈ నవల . చివరకు మిగిలేది .. సమాధానం తెలుసుకోటానికి చేసిన ప్రయత్నాలు వాటి తాలూకా జ్ఞాపకాలు – తనను తాను సమాధానపరుచుకోవటం … అన్న దయానిధి స్వగతంతో ముగుస్తుంది !

రచయిత అక్కడక్కడ అడిగే ఫిలసాఫికల్ ప్రశ్నలు నవల చదివాక కూడా వెంటాడతాయి. సంఘం (దాని కట్టుబాట్లు) మరియు గతం ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చక్కగా వివరించారు. అయితే నవల మగవారికి మరియు మగరాయుళ్ళవంటి ఆడవారికి మాత్రమే నచ్చుతుంది యేమో ! నవల చివరి పేజిలో ఒక మిని-సమీక్ష ఉంది .. అందులో ఎవరో ఒకాయన (ఒకావిడ ? .. వద్దు అలా చూడకండి నేను ఫెమినిష్టుని కాను . ఏదో ఆడో మగో తెలియక అలా రాసాను అంతే) ఇలా రాసారు .. తెలుగు కల్పనాసాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది” అని … నిజమేనేమో ! . లేకపోతే ఎపుడో అరవై యేళ్ళ క్రిందటి నవల నేను ఇప్పుడు చదవటం ఏమిటి !

రాసిన వారు: Halley

  Attachments
 
  1. chimate

అయ్యా, దయచేసి ఈ పుస్తకం మరల అప్లోడ్ చెయ్యగలరా? ఇందులో కేవలం 173 పేజీ వరకు మాత్రమే ఉన్నాయి. పూర్తి పుస్తకం ఇవ్వవలసినదిగా మనవి.

  Attachments
 
  1. kalpana
  1. 5 / 5

link updated

  Attachments
 
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

Shoutbox

rajgon - Sat 18 Jan - 19:29

Dear Admin please provide 1987 chatura novels

admin - Sat 18 Jan - 12:53

Request to all books uploaders, Please don't post copyrighted books to site. Verify before uploading the books

madhu69 - Fri 17 Jan - 23:33

suryadevaranewnavals uoload cheyandhi piease

shahida - Fri 17 Jan - 22:35

Pls latest navy's weekly's download cheyyara

kanakaraju manda - Fri 17 Jan - 19:19

A catcher in the Rye link please

manoj - Fri 17 Jan - 18:03

@ msroopa ..check in madhubabu section or seach in site

rama.vathi - Fri 17 Jan - 17:59

సత్య కుమార్ గారు, స్వాతి వీక్లీ అప్ లోడ్ చేసినందుకు ధన్యవాదములు

msroopa - Fri 17 Jan - 13:44

Yesterday I downloaded Marakatha Manjusha 1 also saw link for Marskatha Manjusha 2. Unfortunately today both books have been removed. Please upload once again.

susmitha - Thu 16 Jan - 20:09

old swathi weekly serials evari daggaraina unte upload cheyagalaru thank u

rama.vathi - Thu 16 Jan - 20:05

సత్యకుమార్ గారు, దయచేసి కొత్త స్వాతి వీక్లి అప్ లోడ్ చెయ్యగలరు

ramnel - Thu 16 Jan - 16:25

Swathi weekly please

manoj - Thu 16 Jan - 13:48

To support this site, దయచేసి ఈ సైట్ లోని ads పై రోజుకి ఒక్కసారైనా క్లిక్ చేయండి. This is the humble request to all site visitors.

ramagopal.ganti - Thu 16 Jan - 10:15

బొమ్మరిల్లు, బాలమిత్ర,బాలబారతులు, బుజ్జాయులు లెవాండి,

ramagopal.ganti - Wed 15 Jan - 19:38

ఆంద్రబుమి విక్లి కొత్త ది లింక్ ఓపెన్ కావడం లెదు సరిద్దిద గలరు

ESWER715 - Wed 15 Jan - 19:18

సత్యకుమార్ గారు బోమరిల్లు మొత్తం ఎన్ని పుస్తకాలు.

The shoutbox is unavailable to non-members

Login Here